Magazines

ఎల్‌కే అద్వానీకి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు

2 గంటల క్రితం

Advani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి.

98 ఏళ్ల అద్వానీని శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. పల్మనరీ విభాగానికి చెందిన వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇటీవలి కాలంలో అద్వానీ ఆస్పత్రిలో చేరడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఇదే ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అంతకుముందు, 2024 డిసెంబర్‌లో కూడా ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చి చికిత్స అందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్