Magazines

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనలు

13 అక్టోబర్, 2026

cec
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: సీఈఓ జ్ఞానేష్ కుమార్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమువుతున్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్, బీహార్ నిరసనలు వ్యక్తమైయ్యాయి. కోల్‌కతాలో మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించింది. టీఎంసీ నిరసనకారులు "ఓటు దొంగ, గద్దీ దొంగ" వంటి నినాదాలు చేశారు. ఈ నిరసన సందర్భంగా వారు మాట్లాడుతూ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు కునాల్ ఘోష్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో పోలీసులను, కేంద్ర బలగాలను మోహరించి శాంతియుత నిరసనను అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము శాంతియుతంగా నిరసన నిర్వహించగా, ఆయా మార్గాల్లో భద్రతా సిబ్బంది తమను అడ్డుకున్నారని తెలియజేశారు.


అదే విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అఖిల భారత విద్యార్థుల సంఘం (AISA), విప్లవ యువజన సంఘం (RYA) మంగళవారం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో నిరసన చేపట్టాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై ఎన్నికల సంఘంపై అనేక సందేహాలు ఉన్నాయని, వాటిపై ఈసీ సరైన వివరణ ఇవ్వాలని డిమాడ్ చేశారు.


కాగా, సోమవారం, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా బ్లాక్ నాయకులు, మద్దతుదారులు బారాఖంబా రోడ్డు గుండా సుప్రీంకోర్టు వైపు పాదయాత్ర చేశారు. అనంతరం, ఓటర్ల జాబితాల SIRకు సంబంధించిన ఎన్నికల సంఘం నిర్ణయాలను సవాలు చేస్తూ 11 మంది ప్రతిపక్ష నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

tmc

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్