నవతెలంగాణ - హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి అట్ల రాజశేఖర్ (30) హత్యకు గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పవర్‌హౌస్ కాలనీలో నలుగురు యువకులు అతడిపై దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. పథకం ప్రకారం ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు పిలిపించిన దుండగులు రాజశేఖర్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు విచారణ చేపట్టి, ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.
సింగరేణి ఉద్యోగి దారుణ హత్య..
33 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)