నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలో డెల్టా ఎయిర్ లైన్స్ ఆటోమేషన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా దాదాపు రెండు వేలకుపైగా విమానాలు ఆలస్యం కాగా.. 125కుపైగా విమానాలు రద్దయినట్లు సమాచారం. డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాల్లో దాదాపు సగానికిపైగా సర్వీసులపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ‘థ్యాంక్స్ గివింగ్’ ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు డెల్టా ఎయిర్‌లైన్స్ తెలిపింది.
యూఎస్‌లో డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం
25 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)