నవతెలంగాణ - హైదారాబాద్ : శబరిమల యాత్ర నేపథ్యంలో పంబా నది కాలుష్యాన్ని అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నదిలో బట్టలు, ఇతర వ్యర్థాలు పడేసే భక్తులకు రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. పంబా నది, ఉపనదులు, స్నాన ఘాట్‌లలో చెత్త వేయవద్దని అధికారులు సూచించారు. నదీ కాలుష్యం, ప్రజారోగ్య సమస్యలను నివారించేందుకు నిబంధనలు పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
పంబా నదిలో వ్యర్థాలు రూ.5 వేల జరిమానా
29 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)