Magazines

భారత్‌–న్యూజిలాండ్ తొలి టెస్టు డ్రా

1 గంట క్రితం

India-New Zealand first Test drawn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ బ్యాటర్లు డారిల్ మిచెల్ (49*) , గ్లెన్ ఫిలిప్స్ (26*) పట్టుదలగా ఆడి 43 ఓవర్ల పాటు క్రీజులో నిలిచారు. ఆరో వికెట్‌కు 63 పరుగులు జోడించడంతో మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకుండా పోయింది. దీంతో మరో 16 ఓవర్లు మిగిలి ఉండగానే ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేయగా, భారత్‌ 720/9 వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 239/5 స్కోరు చేసింది. భారీ శతకం సాధించిన హెన్రీ నికోల్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్