నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రేమకు దేశ సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. ఖమ్మం నగరానికి చెందిన భరత్, బ్రిటన్ యువతి ఎలిజబెత్ ఆదివారం హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇంగ్లాండ్‌లో ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది. ఖమ్మం ముస్తాఫానగర్‌కు చెందిన భరత్ ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్ వెళ్లి, 2021లో మాస్టర్స్ పూర్తి అనంతరం ప్రభుత్వ పెన్షన్ విభాగంలో ఉద్యోగం పొందారు. అదే విభాగంలో పనిచేస్తున్న బ్రిటన్‌కు చెందిన ఎలిజబెత్‌తో ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఖమ్మంలోని బోనకల్లు రోడ్డులోని ఫంక్షన్ హాల్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది.






కామెంట్‌లు (0)