Magazines

కోర్టు ధిక్కరణ కేసు: ఆప్‌ నేతలకు ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు

8 గంటల క్రితం

Contempt of court case: Delhi High Court grants three weeks' time to AAP leaders
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసులో ఆప్‌ నేతలకు మంగళవారం ఢిల్లీ హై కోర్టు మూడు వారాల గడువు విధించింది. అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, సౌరభ్‌ భరద్వాజ్‌ సహా ఇతర ఆప్‌ నాయకులు తమ సమాధానాలను దాఖలు చేసేందుకు ఇదే చివరి గడువుగా పేర్కొంది. ఆ తర్వాత సమాధానాలు సమర్పించే హక్కు కోల్పోతారని హెచ్చరించింది. ఈ కేసును జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ స్వయంగా సుమోటోగా చేపట్టారు.


మే 19న కేజ్రీవాల్‌, ఇతర నేతలకు నోటీసులు జారీ చేస్తూ సమాధానాలు ఇవ్వడానికి నాలుగు వారాల గడువు ఇచ్చారు. అయితే, ఇప్పటివరకు వారి నుంచి సమాధానాలు అందకపోవడంతో మరో మూడు వారాల తుది గడువు విధించారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసుకు సంబంధించి తనపై సోషల్‌మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్ట్‌లు చేశారనే కారణంతో మే 14న జస్టిస్‌ శర్మ ఈ చర్యలు ప్రారంభించారు. కేజ్రీవాల్‌, సిసోడియాతో పాటు ఆప్‌ నేతలు సంజయ్‌ సింగ్‌, దుర్గేశ్‌ పాఠక్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, వినయ్‌ మిశ్రాలపై క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టారు. ఎక్స్‌ వినియోగదారుడు దేవేశ్‌ విశ్వకర్మపై కూడా న్యాయమూర్తి ధిక్కరణ చర్యలు ప్రారంభించారు. అనంతరం న్యాయవాది అశోక్‌ చైతన్య కూడా ఈ వ్యవహారంపై కోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్