నవతెలంగాణ - హైదరాబాద్ : కెనడాలోని సర్రే నగరంలో భారత సంతతికి చెందిన గగన్‌ప్రీత్ రెహల్ (23), సుఖ్జీత్ కౌర్ (24) కాల్పుల్లో మృతి చెందారు. ఈ నెల 15న రాత్రి 10.38 గంటల సమయంలో వాల్‌మార్ట్ పార్కింగ్ ప్రదేశంలో వారు తీవ్ర గాయాలతో కనిపించడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను లక్ష్యంగా చేసుకుని జరిపిన హత్యలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది.
ap7am.com





కామెంట్లు (0)