Magazines

వికారాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

1 గంట క్రితం

Tragic accident in Vikarabad; four members of the same family killed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వికారాబాద్‌ మండలం పెండ్లిమడుగు నుంచి కేరెల్లికి ఆటోలో వెళ్తుండగా, బుగ్గరామేశ్వరం సమీపంలోని మలుపు వద్ద లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ నాగేష్‌తో పాటు చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్