నవతెలంగాణ-హైదరాబాద్: 2023 మణిపూర్ హింసాకాండపై విచారణ కమిటీ దర్యాప్తు గడువును కేంద్రం పొడిగించింది. కమిటీ దర్యాప్తు గడువును పొడిగించడం వరుసగా ఏడవసారి కావడం గమనార్హం. వచ్చే ఏడాది మే 20 వరకు, మరో ఆరు నెలలు గడువును పొడిగించినట్లు కేంద్రం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2023 మేలో మణిపూర్‌లో చెలరేగిన జాతి ఘర్షణల్లో సుమారు 260మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ హింసాకాండపై దర్యాప్తు కోసం 2023 జూన్ 4న నియమించిన ముగ్గురు సభ్యులు దర్యాప్తు కమిటీకి ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జి బల్బీర్ సింగ్ చౌహాన్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీకి మొదట గువహటి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజై లంబా నేతృత్వం వహించారు. అయితే , ఆయన ఫిబ్రవరి 28న సభ్యత్వానికి రాజీనామా ప్రకటించడంతో.. మార్చి 1న జస్టిస్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు.







కామెంట్‌లు (0)