నవతెలంగాణ-హైదరాబాద్: రేపు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో త్రిరంగ ర్యాలీకి సీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆంక్షల మీద ఆంక్షల విధిస్తున్నారు. ఇప్పటికే కన్నాట్ ప్లేస్ వద్ద భారీగా బలగాలు మోహరించాయి. తాజాగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో సీజేపీ (CJP) కార్యకర్త అభిజీత్ దిప్కే బస చేసిన నివాసానికి ఢిల్లీ పోలీసు బృందాలు చేరుకున్నాయి. అక్కడ ఒక పోలీసు అధికారి సమక్షంలో, కన్నాట్ ప్లేస్ పరిసరాల్లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNS) సెక్షన్ 163 అమలులో ఉందని పేర్కొంటూ ఆయనకు ఒక నోటీసును అందజేశారు. శనివారం తలపెట్టిన 'తిరంగా యాత్ర'కు ఎన్డీఎంసీ (NDMC) అనుమతి ఇవ్వలేదని, ఒకవేళ సీజేపీ ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే, అది BNS సెక్షన్ 163 ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో హెచ్చరించారు.
జాతీయ జెండాను (తిరంగా) ప్రదర్శించడం చట్టవిరుద్ధం కాదని, అయితే అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం లేదా జనసమూహాన్ని సమీకరించడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, అటువంటి సందర్భంలో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని దిప్కేకు తెలియజేశారు. అలాగే, 'ఫ్లాగ్ కోడ్' (Flag Code) ప్రకారం జాతీయ జెండాను తగిన గౌరవంతో చూడాలని, అందుకు సంబంధించిన నిబంధనలను పాటించాలని కూడా ఆయనకు వివరించారు.







కామెంట్లు (0)