Magazines

పుల్లయ్యను పరామర్శించిన నాయకులు

23 నిమిషాల క్రితం

Kokkerapati Pullaiah
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

- వెంకటమ్మ చిత్రపటానికి ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ పుష్పాంజలి

నవతెలంగాణ - అశ్వారావుపేట

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య ను మంగళవారం పలువురు రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. పుల్లయ్య తల్లి కొక్కెరపాటి వెంకటమ్మ వయోభారంతో శనివారం మృతి చెందగా, ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.


ఈ నేపథ్యంలో వరంగల్‌ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పీడీఎఫ్‌ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు ఎం.సుబ్బారావు, తెలంగాణ రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్‌ పుల్లయ్య ను పరామర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం వెంకటమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు చిరంజీవి, పామాయిల్ రైతు నాయకులు చెలికాని సూరిబాబు,కారం శ్రీరాములు,ఆల్ ఇండియా లాయర్ యూనియన్ నాయకులు ఉడతనేని శ్రీనివాసరావు, తుమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్