Magazines

కొలనుపాక సోమేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు!

18 నిమిషాల క్రితం

Someshwara Temple!
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

కార్తీక పౌర్ణమి వేళ శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రం

సోమేశ్వరుడు, కోటొక్క లింగం, చండికాంబ దర్శనానికి బారులు తీరిన భక్తులు

తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

నవతెలంగాణ – ఆలేరు రూరల్

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలేరు మండలం కొలనుపాకలోని ప్రసిద్ధ చండికాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభం కావడంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి.


తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు జీఎం సోమయ్య,గంగాధర్, రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి సోమేశ్వర స్వామి, కోటొక్క లింగం, చండికాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.


మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలేరు పోలీసులు ఆలయం వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. కార్తీక పౌర్ణమి వేడుకలతో కొలనుపాక శైవక్షేత్రం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్