Magazines

మహిళలపై హింసకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు

13 నిమిషాల క్రితం

IDWA
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

- ​నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో అవగాహన సదస్సులు

- ​చట్టాల లోపాల వల్లే మహిళలపై దాడులు

- ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి

నవతెలంగాణ-సత్తుపల్లి 

​మహిళలపై జరుగుతున్న హింసను పూర్తిగా నిర్మూలించేందుకు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి పిలుపునిచ్చారు.


మంగళవారం స్థానిక రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల భవనంలో) ఐద్వా పట్టణ కార్యదర్శి చెరుకు రత్న కుమారి అధ్యక్షతన జరిగిన ఐద్వా డివిజన్ స్థాయి సమావేశంలో భారతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 16 రోజులపాటు జరిగే ఈ అవగాహన సదస్సులను కళాశాలలు, వసతి గృహాల్లో  నిర్వహించడం తోపాటు బీసీ వసతి గృహాల్లో సెమినార్లు, చర్చా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థినులు, మహిళల్లో చైతన్యం కల్పించాలని ఆమె సూచించారు. నేడు మహిళలు విద్య, వైద్యం, రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారిపై వివక్ష, అసమానతలు, అణచివేత కొనసాగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.


బాలికల నుంచి వృద్ధుల వరకు లైంగిక వేధింపులు, అత్యాచారాలు, గృహహింస, వరకట్న వేధింపులు, కుల వివక్ష వంటి దాడులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో లోపాలు, నిందితులకు సకాలంలో శిక్షలు పడకపోవడం వల్లే నేరాలు పెరుగుతున్నాయని విమర్శించారు. చట్టపరమైన చర్యలతో పాటు సమాజంలో విస్తృత చైతన్యం తీసుకురావడం ద్వారానే ఈ హింసను అరికట్టగలమని స్పష్టం చేశారు.


​అనంతరం ఐద్వా సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి మాట్లాడుతూ.. ఈ 16 రోజుల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని ప్రతి మండలంలో, కళాశాలల్లో సెమినార్లు, ర్యాలీలు, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. హింసకు వ్యతిరేకంగా, సమానత్వ సాధన కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్తామని చెప్పారు. శీలం ఫకీరమ్మ మాట్లాడుతూ... మహిళలు తమపై జరుగుతున్న అన్యాయాలపై ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐద్వా నాయకురాళ్లు జాజిరి జ్యోతి, పుష్పపల్లి రాణిరుద్రమ్మ, లత స్వరూప, ప్రభావతి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్