Magazines

దీపావళి పండుగ..ఢిల్లీ మెట్రో రైల్ సమయంలో మార్పులు

34 నిమిషాల క్రితం

Diwali festival: Changes to Delhi Metro Rail timings
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీ దృష్ట్యా మెట్రో రైలు సమయంలో మార్పులు చేశారు. ఆదివారం దీపావళి రోజున ఉదయం 6గంటల నుంచి రాత్రి పది గంటలకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాధారణ రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటలకు వరకు మెట్రో సేవలు కొనసాగుతాయి. తాజా నిర్ణయంతో ఉదయం త్వరగా మెట్రో రాకపోకలు మొదలు కానునున్నాయి. దీపావలి నేపథ్యంలో పింక్ లైన్ (మజ్లిస్ పార్క్ నుండి శివ్ విహార్ / మజ్లిస్ పార్క్ వరకు), మెజెంటా లైన్ (బొటానికల్ గార్డెన్ నుండి కృష్ణ పార్క్ ఎక్స్‌టెన్షన్ మజ్లిస్ పార్క్ నుండి దీపాలి చౌక్ వరకు) మరియు గ్రే లైన్ (ద్వారకా కక్రోలా నుండి ధన్సా బస్ స్టాండ్ వరకు) సర్వీసులు, టెర్మినల్ స్టేషన్ల నుండి ఒక గంట ముందుగా ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయి.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్