Magazines

పట్టభద్రుల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

10 నిమిషాల క్రితం

Draft electoral roll for graduates released
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్, వరంగల్ - ఖమ్మం - నల్గొండ నియోజకవర్గాలకు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రెండు నియోజకవర్గాల్లో కలిపి 12,69,191 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపింది. వీటిలో 11,89,191 దరఖాస్తులను అర్హమైనవిగా గుర్తించింది. 80,635 దరఖాస్తులను అనర్హమైనవిగా తిరస్కరించింది. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్‌లో 5,68,105 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారని పేర్కొంది.


వరంగల్ - ఖమ్మం - నల్గొండలో - 6,21,086 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారని తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణకు డిసెంబరు 10వ తేదీ వరకు గడువు విధించింది. ఈ జాబితాలో పేరు లేని అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.


ఈ వివరాల సవరణకు ఫారం-8.. పేర్ల తొలగింపుపై అభ్యంతరాలకు ఫారం-7లను సమర్పించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆయా వివరాలతో సీఈవో తెలంగాణ వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుందని చెప్పింది. డిసెంబరు 25వ తేదీలోగా అభ్యంతరాలను పరిష్కరించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 30వ తేదీన ఇందుకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ఎన్నికల సంఘం పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్