Magazines

పౌల్ట్రీ యూనిట్ల నిర్మాణానికి సింగిల్ విండో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

18 నిమిషాల క్రితం

Chief Minister Revanth Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: గ్రామ పంచాయతీల పరిధిలో పౌల్ట్రీ యూనిట్ల నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేసేలా అవసరమైన మార్పులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పౌల్ట్రీ పరిశ్రమ స్థాపనకు ఎదురవుతున్న సమస్యలను పరిశ్రమ ప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని, సంక్షోభ సమయాల్లో ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతూ పలు ప్రతిపాదనలు అందించారని తెలిపారు.


హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిరోజూ 5 కోట్ల 30 లక్షల గుడ్లను ఉత్పత్తి చేస్తూ విద్యార్థులు, యువతకు పౌష్టికాహారం అందించడంలో పౌల్ట్రీ వ్యాపారులు కీలక భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఈశ్వర్ కుమార్, రాజ్ కుమార్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మాల్ రెడ్డి రాంరెడ్డి, శివసేనారెడ్డి, పౌల్ట్రీ ఇండియా ప్రెసిడెంట్ ఉదయ్ సింగ్ బయాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్