నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర పూణే కోర్టులో దారుణం జరిగింది. న్యాయ విచారణకు హాజరైన ఒక హత్య నిందితుడిపై కత్తితో దాడి చేసి, ఆపై కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. మందార్ మారుతి కివ్లేగా గుర్తించిన ఆ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కత్తితో పదేపదే కొడుతూ కనిపించారు. దుండగుల దాడిలో బాధితునికి ఓ చెయి కట్ అయింది. దాడి తర్వాత దుండగుల బైక్ మీద పారిపోయారు. ఫుట్‌పాత్‌పై బాధితుడు పడిపోవడంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు.
పోలీసుల ప్రకారం, ఏప్రిల్ 2025లో పూణేలోని సంతోష్‌నగర్ కత్రజ్‌లో భూమి మరియు ఆర్థిక వివాదం కారణంగా శుభం సుభాష్ చవాన్ అనే వ్యక్తిని హత్య చేసినందుకు కివ్లే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతను నాలుగు రోజుల క్రితం జైలు నుండి విడుదలయ్యాడు మరియు న్యాయ విచారణకు వచ్చినప్పుడు కోర్టు బయట అతనిపై దాడి జరిగింది.






కామెంట్‌లు (0)