Magazines

సెన్సెక్స్‌ దూకుడు.. ఒక్కరోజే 2 వేల పాయింట్ల లాభం !

14 నిమిషాల క్రితం

Sensex on a roll.. a gain of 2,000 points in a single day!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 2 వేల పాయింట్లకు పైగా ఎగబాకి 84,498.21 వద్ద గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం 500 పాయింట్లకు పైగా లాభపడి 25,900 స్థాయిని అందుకుంది. బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ల ర్యాలీకి ప్రధానంగా దోహదపడ్డాయి.

మధ్యాహ్నం 12.50 గంటల సమయానికి సెన్సెక్స్‌ 1,339.08 పాయింట్ల లాభంతో 83,775.07 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 383 పాయింట్లు పెరిగి 25,733.20 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ మినహా మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ట్రేడయ్యాయి.

మార్కెట్ల ర్యాలీకి కారణాలివే ..

లార్జ్‌క్యాప్‌ షేర్లలో కొనుగోళ్లు: అధిక వెయిటేజీ కలిగిన పెద్ద కంపెనీల షేర్లు రాణించడం సూచీలకు బలాన్నిచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండిగో వంటి షేర్లు సుమారు 4 శాతం మేర లాభపడటంతో మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్