Magazines

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సిమెంట్ కుర్చీలు ఏర్పాటు

1 గంట క్రితం

Kammarpally
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

- అమీర్ నగర్ లో గొర్రె గణేష్ ఉదారత

నవతెలంగాణ - కమ్మర్‌పల్లి

మండలంలోని అమీర్ నగర్ గ్రామానికి చెందిన గొర్రె గణేష్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామంలో సేవా కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న గణేష్ స్వగ్రామంలో తన తల్లిదండ్రులు గొర్రె లక్ష్మీ పోషన్న పేరు మీద ఏదో ఒక కార్యం చేయాలని సంకల్పించాడు. అందులో భాగంగా బుధవారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం, స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద నూతనంగా 2 సిమెంట్ కుర్చీలు వేయించారు.


ఈ సందర్భంగా గొర్రె గణేష్ మాట్లాడుతూ.. మా అమ్మానాన్నల పేరు గ్రామంలో శాశ్వతంగా నిలిచిపోవాలని, గ్రామ ప్రజలకు ఉపయోగపడే పని చేయాలని ఈ కుర్చీలు ఏర్పాటు చేశానన్నారు. ఈ కుర్చీలు అంబేద్కర్ విగ్రహం వద్ద బస్ కోసం వేచి చూసే ప్రయాణికులకు, సాయంకాలం ప్రజలు కూర్చుండడానికి ఉపయోగపడతాయని తెలిపారు. గణేష్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు అభినందించారు. తల్లిదండ్రుల పట్ల భక్తి, గ్రామం పట్ల ప్రేమ చూపిన గణేష్‌ను గ్రామ పెద్దలు, యువకులు ప్రశంసించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్