Magazines

కండక్టర్ ప్రవళికకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

39 నిమిషాల క్రితం

Ex-gratia of Rs 10 lakh for conductor Pravalika
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం దగ్గర ఆర్టీసీ బస్సులో చిల్లర కోసం కండక్టర్ ప్రవళికకు, ప్రయాణికురాలికి మధ్య జరిగిన గొడవతో కండక్టర్ బస్సు చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పలు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించింది. తాజాగా మణుగూరు డిపో బస్సు కండక్టర్ ప్రవళిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ దగ్గర కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి మంత్రి నివాళులు అర్పించారు. ప్రవళిక తల్లిని పరామర్శించి వారికి ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం, ఆర్టీసీ నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుంచి కోటి రూపాయల ప్రమాద బీమా ప్రవళిక కుటుంబానికి అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్