Magazines

టెక్సాస్ ఫలితాలు డొనాల్డ్ ట్రంప్‌నకు షాక్

27 నిమిషాల క్రితం

Texas results come as a shock to Donald Trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: టెక్సాస్ ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఊహించని షాకిచ్చాయి. రాష్ట్ర గవర్నర్ పదవి బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జీనా హిజోహోసా ఘన విజయం సాధించారు. టెక్సాస్ సెనేట్ సీటు కూడా డెమోక్రాట్ల సొంతమైంది. ఆ పార్టీ అభ్యర్థి జేమ్స్ టలరికో ఘన విజయం సాధించారు. అమెరికా చట్టసభలపై డెమోక్రాట్లు పట్టుబిగించిన నేపథ్యంలో ఇకపై ట్రంప్ సర్కారుకు ఇబ్బందులు తప్పవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాన్సస్‌ (Kansas)లో దశాబ్దాలుగా కొనసాగుతోన్న రిపబ్లికన్ల ఆధిపత్యానికి డెమోక్రాట్ అభ్యర్థి ఆడమ్‌ హమిల్టన్‌ తెరదించి చరిత్ర సృష్టించారు. సిట్టింగ్ రిపబ్లికన్ అభ్యర్థి రోజర్ మార్షల్‌పై ఆయన సంచలన విజయం సాధించారు. 1932 తర్వాత డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనెటర్‌గా గెలిచిన మొదటి వ్యక్తిగా నిలిచారు.


అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫలితాల్లో డెమోక్రాట్లు భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే సెనెట్‌లో ఆధిపత్యం సాధించగా.. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజార్టీ మార్క్‌ (218) దాటేశారు. ఇక కాన్సస్‌లో రిపబ్లికన్ల కంచుకోట కూలింది. 94 ఏళ్ల తర్వాత కాన్సస్ రాష్ట్రంలో సెనెట్ స్థానం డెమోక్రాట్ల వశమైంది (). 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్