నవతెంగాణ - వైరా : ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటనలో కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన కోటా కిశోర్‌రెడ్డి, భార్య లావణ్య, కుమారుడు ప్రణీత్ ఏపీలోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా వైరా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో కిశోర్‌రెడ్డి, లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రణీత్‌ను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)