నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్‌తో నవంబర్ 27 నుంచి క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ కుడి తొడకండరాల గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. వెల్లింగ్టన్‌లో ప్రాక్టీస్ సందర్భంగా అతడు గాయపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. టిక్నర్ స్థానంలో యువ పేసర్ మ్యాట్ ఫిషర్‌ను జట్టులోకి తీసుకున్నారు. గాయం తీవ్రత, అతడు తిరిగి మైదానంలోకి వచ్చే సమయంపై స్పష్టత కోసం క్రైస్ట్‌చర్చ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
రెండో టెస్టుకు న్యూజిలాండ్‌కు షాక్..
50 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)