నవతెలంగాణ - హైదరాబాద్ : వర్ధన్నపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై తండ్రి, కుమారుడు ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన కారు వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గూగులోతు సురేష్ తీవ్రంగా గాయపడగా, ఆయన కుమారుడు అభిరామ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుమారుడు అభిరామ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
వర్ధన్నపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)