నవతెలంగాణ – ఉప్పునుంతల: ఉప్పునుంతల మండల తహసీల్దార్ అద్దంకి సునీత సస్పెన్షన్‌కు గురైనట్లు మండలంలో చర్చ జరుగుతోంది. అయ్యవారిపల్లి గ్రామ పరిధిలోని 115 సర్వే నంబర్లో భూ పట్టా మార్పిడి వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న స్వప్న ఉప్పునుంతల మండల తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై జిల్లా అధికార యంత్రాంగం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై వివరణ కోసం తహసీల్దార్ అద్దంకి సునీతను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆమె వివరణ అందుబాటులోకి రాలేదు. అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ వ్యవహారంపై స్పష్టత రానుంది.
తహసీల్దార్ అద్దంకి సునీత సస్పెండ్ అయ్యారా?
1 గంట క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)