Magazines

ఫిజికల్ ఎడ్యుకేషన్‌ అభివృద్దికి 
ప్రత్యేక చర్యలు అవసరం

9 నిమిషాల క్రితం

education
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

జాతీయ సదస్సులో ప్రొఫెసర్‌ పియూష్‌ జైన్‌

హైదరాబాద్‌ : ఫిట్‌నెస్‌, క్రీడా సంస్కృతి ప్రోత్సాహంలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పాత్ర విలువైనది. అటువంటి ఫిజకల్‌ ఎడ్యుకేషన్‌ అభివృద్దికి ప్రత్యేక చర్యలు అవసరమని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి ప్రొఫెసర్‌ పియూష్‌ జైన్‌ అన్నారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో ఆవరణలో జై భారత్‌ లెజెండ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో ఆయ మాట్లాడుతూ.. 'తెలంగాణ రాష్ర్టంలో గత 12 సంవత్సరాల్లో వేలాది మంది ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ శిక్షణ పూర్తి చేసినా, తగిన అవకాశాలు, ఉద్యోగాలు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా రంగాన్ని బలోపేతం చేసేందుకు ఖేలో ఇండియా కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ఆర్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ శిక్షణ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ రిజిస్ర్టేషన్‌తో గుర్తింపుతో పాటు ఉద్యోగ నియామకాల్లో అవకాశాలు లభిస్తాయని తెలిపారు'. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అభివృద్దికి ప్రొ.పియూష్‌ జైన్‌ అభినందనీయమని, ఆయన సూచనల మేరకు తెలంగాణలో ఎన్‌ఎస్‌ఎస్‌ఆర్‌ రిజిస్ర్టేషన్లు వేగవంతం చేస్తామని జెబిఎల్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ బాబులాల్ తెలిపారు. కార్యక్రమంలో ఓయూ ప్రొఫెసర్లు రాజేశ్‌ కుమార్‌, దీప్లా, సునీల్‌ కుమార్‌ సహా బాలరాజు, బి. లక్ష్మయ్య, పర్వతాలు గౌడ్‌, జక్కయ్య, సాయిబాబా, అశోక్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్