Magazines

52 బంతుల్లోనే 200

6 నిమిషాల క్రితం

Suryavanshi
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

వైభవ్‌ సూర్యవంశీ ఊచకోత

లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రికార్డుల మోత


దోహా (ఖతార్‌) : 15 ఏండ్ల చిన్నోడు.. ప్రపంచ క్రికెట్‌లో రికార్డుల పుస్తకాన్ని తిరగరాస్తున్నాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో శ్రీలంకపై 11 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన వేగవంతమైన ఫిఫ్టీ సాధించిన వైభవ్‌ సూర్యవంశీ... తాజాగా దోహాలో యుఏఈపై ఇరగదీశాడు. ఆసియా కప్‌ (రైజింగ్‌ స్టార్స్‌) గ్రూప్‌ దశ మ్యాచ్‌లో యుఏఈ-ఏపై వైభవ్‌ సూర్యవంశీ ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్‌ సూర్యవంశీ.. ఆసీస్‌ కుర్రాడు జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ రికార్డును బద్దలు కొట్టాడు. 40 బంతుల్లో 150 పరుగుల మైలురాయి చేరుకుని తన పేరిటే ఉన్న 59 బంతుల రికార్డును మెరుగుపర్చుకున్నాడు. 52 బంతుల్లోనే ద్వి శతకం సాధించి సరికొత్త చరితృ సృష్టించాడు. గతంలో 103 బంతుల్లో చాడ్‌ బోవెస్‌ సెంచరీ చేయగా.. వైభవ్‌ సూర్యవంశీ ఆ రికార్డును అద్వితీయ రీతిలో బద్దలుకొట్టాడు. కేవలం 52 బంతుల్లోనే 200 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వేగవంతమైన 50, 100, 150 సహా 200 పరుగుల రికార్డు వైభవ్‌ సూర్యవంశీ ఒక్కడి పేరిటే ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఏ ఫార్మాట్‌లోనైనా ఇలా ఇన్ని వేగవంతమైన రికార్డులు ఒక్కడి పేరిటే ఉండటం సైతం ఓ రికార్డు!

ఒక్కడే దంచికొట్టాడు

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లో యుఏఈ-ఏపై భారత్‌-ఏ 7 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. 250 పరుగుల ఛేదనలో వైభవ్‌ సూర్యవంశీ ఒక్కడే 204 పరుగులు చేశాడు. అందులో 28 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. వైభవ్‌ సూర్యవంశీ పరుగుల సునామీతో ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లోనే భారత్‌-ఏ

100 పరుగులు చేయగా, ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లోనే వైభవ్‌ సూర్యవంశీ ద్వి శతకం సాధించాడు. అభిషేక్‌ శర్మ (12), ప్రభుసిమ్రన్‌ సింగ్‌ (3) నిరాశపరిచినా.. ఓ ఎండ్‌లో వైభవ్‌ విధ్వంసంలో యుఏఈ-ఏ కొట్టుకుపోయింది. ఆఖర్లో రింకూ సింగ్‌ (27 నాటౌట్‌), కుమార్‌ కుశాగ్ర (1 నాటౌట్‌) లాంఛనం ముగించారు. యుఏఈ-ఏ తొలుత 50 ఓవర్లలో 8 వికెట్లకు 249 పరుగులు చేసింది. హర్‌ప్రీత్‌ సింగ్‌ (130, 144 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. వైభవ్‌ సూర్యవంశీ ఛేదనలో ఊచకోత ఇన్నింగ్స్‌తో 50 ఓవర్ల మ్యాచ్‌ను కేవలం 14.2 ఓవర్లలోనే ముగించాడు.

మాటల్లో వర్ణించలేను!

' మాటల్లేవ్‌' ఇదీ భారత్‌- ఏ కెప్టెన్‌ తిలక్‌ వర్మ రియాక్షన్‌. వైభవ్‌ సూర్యవంశీ ఊచకోత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు ఆడిన విధానంతో ఐదు ఓవర్లలోనే మ్యాచ్‌ ఏకపక్షమైంది. ఐదు ఓవర్లలోనే 100 పరుగులు, ఆ తర్వాత అతడు దండయాత్ర చేసిన విధానం అద్భుతం. వైభవ్‌ ఎంతటి విధ్వంసకర ఆటగాడో అందరికీ తెలుసు. సిక్సర్లు ఎంత సులువుగా సాధిస్తాడో తెలుసు. సూర్యవంశీ సిక్సర్లను అందరం ఎంజాయ్‌ చేశాం. మరిన్ని సిక్సర్లు కొట్టాలని డ్రెస్సింగ్‌రూమ్‌లో కేరింతలు కొట్టాం. ఇది చూడముచ్చటైన ఇన్నింగ్స్‌. అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో కచ్చితంగా ఒకటని తిలక్‌ వర్మ అన్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్