Magazines

ఆగివున్న స్కూల్‌ బస్సును ఢీకొన్న ట్రక్కు

10 నిమిషాల క్రితం

Truck
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

నలుగురు విద్యార్థులు మృతి..32 మందికి గాయాలు..యూపీలో విషాదం

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. కనౌజ్‌లో లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న ఒక పాఠశాల బస్సును వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 24 మంది విద్యార్థులతో సహా మొత్తంగా 32 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌‌లోని కౌశాంబి పట్టణానికి చెందిన ఓరియంటల్ పబ్లిక్ స్కూల్‌ విద్యార్థులు పాఠశాల బస్సులో ఆగ్రాలోని తాజ్ మహల్ విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తున్నారు. బస్సులో గి వస్తున్న విద్యార్థులు, సిబ్బందితో సహా 50 మంది ప్రయాణిస్తున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో కనౌజ్‌ ‌పట్టణంలోని థాథియా ప్రాంతం సమీపంలో విద్యార్థులు టాయిలెట్ ఉపయోగించుకోవడానికి వీలుగా పాఠశాల బస్సును రోడ్డు పక్కన నిలిపి ఉంచారు.


ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఒక ట్రక్కు వేగంగా బస్సును బలంగా ఢీకొటింది. దీంతో పాఠశాల బస్సు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమయింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పోలీసు సిబ్బంది, ఉత్తర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూపీఐడీఏ) సిబ్బంది, స్థానికులు సహయక చర్యలను ప్రారంభించారు. ధ్వంసమైన దెబ్బతిన్న బస్సులో నుంచి విద్యార్థులను రక్షించారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల్లో వైద్య కళాశాలకు తరలించగా, అక్కడ నలుగురు చిన్నారులు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థులను ప్రేమ్ కుమార్ చౌరాసియా కుమారుడు ఆర్యన్ చౌరాసియా (14), షమీయుల్లా కుమారుడు రజియుల్లా (16), రియాజ్ అహ్మద్ కుమారులు అర్మాన్ (17), జైద్ మీర్జా (17)గా గుర్తించారు. గాయపడిన వారిలో 24 మంది విద్యార్థులు, ఎనిమిది మంది పాఠశాల సిబ్బంది ఉన్నారు. వీరిలో పాఠశాల మేనేజర్ సల్మాన్, పరిస్థితి విషమంగా ఉన్న ఒక బాలుడిని తదుపరి చికిత్స కోసం కాన్పూర్‌కు తరలించారు. ఈ ప్రమాదం నుండి ఎటువంటి గాయాలు లేకుండా బయటపడిన విద్యార్థులను మరో బస్సులో వారి ఇండ్ల కు తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్