Magazines

తిరుప్పరంకుండ్రంలో రాతిస్తంభంపై వెలగని ‘కార్తిక దీపం’

9 నిమిషాల క్రితం

The ‘Karthika Deepam’ that does not light up on the stone pillar at Tirupparankundram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయంలో వెలిగిన ‘మహా దీపం’
మదురై: తమిళనాడులోని తిరుప్పరం కుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించే విషయంలో ఉద్రిక్తత కొనసాగింది. కార్తిక పౌర్ణమి రోజున కొండపై ఉన్న ‘దీపతూన్‌’ రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. మంగళవారం సాయంత్రం రాతి స్తంభం వద్ద కాకుండా, ఎప్పటిలాగే దీనికి కొంత దూరంలో ఉన్న ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయం దీప మండపంలో ‘మహా దీపం’ వెలిగించారు. రాతి స్తంభం వద్ద మహా దీపం వెలిగించకపోవడంతో పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. సంప్రదాయంగా ఉచ్చి పిళ్లైయార్‌ ఆలయంలోనే దీపం వెలిగించడంపై నిరసన వ్యక్తం చేయగా.. వారిని పోలీసులు చెదరగొట్టారు. దీంతో ఉచ్చి పిళ్లైయార్‌ ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉండగా, కొండపై కార్తిక దీపాన్ని వెలిగించే దృశ్యాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చేరుకోవడంతో సందడి నెలకొంది. అనేక మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరువణ్ణామలై తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల్లోనూ ప్రజలు దీపాలను వెలిగించారు.

మరోవైపు, కార్తిక పౌర్ణమి రోజున కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. తిరుప్పరంకుండ్రంలో 144 సెక్షన్‌ విధించడంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ ప్రాంతంలో ఇంత భారీగా పోలీసులను మోహరించడం ఇదే తొలిసారి.

మిత్రపక్షాలను సంతోషపెట్టేందుకే..: బీఎల్‌ సంతోష్‌

ఈ పరిణామంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ స్పందించారు. ఉచ్చి పిళ్లైయార్‌ ఆలయ సమీపంలోని దీప మండపం వద్ద కార్తిక దీపం వెలిగించామంటూ తమిళనాడు న్యాయశాఖ మంత్రి నిర్మల్‌ కుమార్‌ ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టుకు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మీ మిత్రపక్షాలను సంతోషపెట్టేందుకే భక్తులను బాధపెట్టి, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారు. పైగా సుప్రీం కోర్టు ఉత్తర్వులను పూర్తిగా ధిక్కరించిన ప్రభుత్వానికి మీరే న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్