బేడీలతోనే వస్తారు : బంగ్లా మంత్రి
న్యూఢిల్లీ : వచ్చే నెల 16వ తేదీన స్వదేశం వెళ్లాలని అనుకుంటున్నానని భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. పదవీచ్యుతురాలైన హసీనా 2024 ఆగస్ట్ నుంచి న్యూఢిల్లీలో తలదాచుకుంటున్నారు. తనను ఢాకా తీసుకొని పోవాల్సిందిగా హసీనా బంగ్లా ప్రభుత్వాన్ని కోరారని ఆమె ప్రతినిధి చెప్పారు. కాగా హసీనా ఏ విధంగా స్వదేశానికి వెళతారనేది ఇంకా తెలియడం లేదు. విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఆందోళనను అమానుషంగా అణచివేసిన ఉదంతానికి సంబంధించిన కేసులో బంగ్లాదేశ్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. హసీనా సాధారణ వాణిజ్య ప్రయాణికురాలిగా స్వదేశానికి రాలేరని, చేతికి బేడీలతోనే వస్తారని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయూన్ కబీర్ మంగళవారం విలేకరులకు తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన అల్లర్లకు హసీనా, భారత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వారు మద్దతు ఇస్తున్నారని నిందించారు.
వచ్చే నెల 16న స్వదేశం వెళ్తా : హసీనా
11 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)