ఓవరాల్ విజేతగా డీపీఎస్ కొల్లూర్
హైదరాబాద్ : జాతీయ స్థాయి ఇంటర్-డీపీఎస్ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్) ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో డీపీఎస్ కొల్లూరు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. రెండు రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 120 మంది ఆర్చర్లు పోటీపడ్డారు. కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో అండర్-10, అండర్-13, అండర్-15 సహా అండర్-17 వయో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అన్ని విభాగాల్లో కలిపి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన డీపీఎస్ కొల్లూరు పసిడి పతకం సాధించగా, డీపీఎస్ ఘట్‌కేసర్ సిల్వర్, డీపీఎస్ నాదర్‌గుల్ కాంస్య పతకం దక్కించుకున్నాయి. డీపీఎస్ కొల్లూరు ప్రొ వైస్ చైర్మెన్ టి. భీమసేన్, వైస్ చైర్మెన్ టి. ప్రణయ్, జనరల్ సెక్రటరీ టి.ఎస్ పవన్ కళ్యాణ్ విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు.






కామెంట్‌లు (0)