విదేశాలకు వెళ్లే నిరుద్యోగులకు గుడ్ న్యూస్

1 గంట క్రితం

Good news for unemployed individuals planning to go abroad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ (CMOES) ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో 19 జారీ చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 7 వేల మందికి సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద మొదటి కేటగిరీలో రూ.లక్ష వ్యయంలో 50 శాతం, గరిష్ఠంగా రూ.50 వేల సబ్సిడీ అందించనున్నారు. రెండో కేటగిరీలో భాషా శిక్షణ లేదా ప్రయాణ ఖర్చుల కోసం రూ.3.50 లక్షల వ్యయంలో 50 శాతం, గరిష్ఠంగా రూ.1.75 లక్షల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ పథకానికి 18 నుంచి 40 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువత అర్హులుగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్