ఢిల్లీలో నేడు ఇండియా కూటమి కీలక సమావేశం

54 నిమిషాల క్రితం

Key meeting of the INDIA alliance in Delhi today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఢిల్లీలో శనివారం ఉదయం 11:30 గంటలకు ఇండియా కూటమి ఎంపీల కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. దేశ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలు, కూటమి భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కూటమి నేతలు, ఎంపీలు పాల్గొననున్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్