ఆఫ్ఘనిస్తాన్‌లో స్వల్ప భూకంపం.. 3.8 తీవ్రత నమోదు

56 నిమిషాల క్రితం

Mild earthquake in Afghanistan; magnitude 3.8 recorded
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం తెల్లవారుజామున 6:25 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైంది. భూమికి 117 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. టెక్టానిక్ పలకల కదలికల వల్ల భూమి అంతర్భాగంలో ఒత్తిడి పెరిగి ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. సాధారణంగా 4.5 కంటే తక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు స్వల్ప ప్రభావాన్నే చూపుతాయని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్