Magazines

నేడు భారత్‌ - వెస్టిండీస్ తొలి టీ20

06 అక్టోబర్, 2026

India vs West Indies first T20 today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు జింబాబ్వే, ఆఅఫ్గానిస్థాన్‌ సిరీస్‌లు, ఆసియా క్రీడల్లో విజయం తర్వాత ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌ సవాలుగా మారింది. లఖ్‌నవూలో మంగళవారం తొలి టీ20 జరగనుంది. వన్డే సిరీస్‌లో ఓడిపోయినా, బ్యాటింగ్‌లో అదరగొట్టిన వెస్టిండీస్‌ టీ20ల్లో మరింత ప్రమాదకరంగా మారనుంది. షై హోప్‌, హెట్‌మయర్, రోమన్‌ పావెల్, షెర్ఫానీ రూథర్‌ఫర్డ్‌ వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లతో పాటు అకీల్‌ హొసీన్‌, గుడాకేశ్‌ మోటీ వంటి స్పిన్నర్లు, రొమారియో షెఫర్డ్, షమార్‌ స్ప్రింగర్‌ వంటి ఆల్‌రౌండర్లు ఆ జట్టు సొంతం. భారత్‌కు గెలవాలంటే ఉత్తమ ప్రదర్శన చేయాల్సిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్