Magazines

తెలంగాణలో భూముల రీ సర్వే.. మార్గదర్శకాలు జారీ

34 నిమిషాల క్రితం

Land re-survey in Telangana: Guidelines issued
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: తెలంగాణలో భూముల రీ సర్వేపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సర్వేకు నాలుగు రోజుల ముందే రైతులకు నోటీసులు ఇవ్వాలని, రెండు రోజుల ముందే పట్టాదారులకు ఫ్లాగ్స్‌ అందించాలని సీసీఎల్‌ఏ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ ఆదేశించారు. సర్వే పూర్తయిన వెంటనే కొలిచిన భూమి విస్తీర్ణాన్ని రైతులకు తెలియజేయాలని సూచించారు. పహాణీ, వాస్తవ కొలతల్లో తేడాలుంటే కారణాలను నమోదు చేయాలన్నారు. గ్రామస్థాయి క్యాంపుల ద్వారా అభ్యంతరాలు, భూ వివాదాలను పరిష్కరించాలని, అప్పీళ్లు పూర్తయ్యాకే తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ జిల్లా మినహా మిగిలిన జిల్లాల అధికారులు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్