Magazines

తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు అదృశ్యం

14 నిమిషాల క్రితం

Mother and two children go missing
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ -హైదరాబాద్ : మెదక్ జిల్లా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అదృశ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. భర్త మరణించడంతో మన్నె రేణుక (26) తన కుమార్తెలు నిఖిత (5), నిత్యశ్రీ (3)తో కలిసి జోగిపేటలో నివాసం ఉంటోంది. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 7న మర్పల్లిలోని పుట్టింటికి వచ్చిన ఆమె, నవంబర్ 9న ఇద్దరు పిల్లలతో కలిసి జోగిపేటకు బయలుదేరింది. అయితే వారు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసినవారి వద్ద వెతికారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి, ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్