నవతెలంగాణ - హైదరాబాద్ : కర్ణాటక ప్రభుత్వం నందిని పాల ధరలను లీటరుకు రూ.8 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో టోన్డ్ పాల ధర రూ.46 నుంచి రూ.54కు చేరనుంది. పశువుల మేత, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెంచిన రూ.8లో రూ.7 నేరుగా రైతులకు అందజేయనున్నట్లు మంత్రి కృష్ణ బైరేగౌడ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 10 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగనుందని ప్రభుత్వం పేర్కొంది.







కామెంట్‌లు (0)