నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పచ్చి గుడ్లతో తయారు చేసే మయోనైజ్ అమ్మకాలు, నిల్వలపై ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఆహార భద్రతా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పచ్చి గుడ్ల వినియోగం వల్ల సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నిషేధం విధించినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.







కామెంట్‌లు (0)