నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన ఫోన్‌ను స్వయంగా ప్రధాని మోడీనే ట్యాప్ చేయిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రధాని కనుసన్నల్లోనే తనపై నిఘా కొనసాగుతోందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో తమ గొంతు నొక్కుతున్నారని, కీలకమైన అంశాలపై మాట్లాడకుండా మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు, ఓట్ల చోరీ, ఎస్ఐఆర్, జనరల్ నరవణె పుస్తకం, ఎప్‌స్టీన్ అంశాలపై నన్ను మాట్లాడనివ్వలేదు. నాకు ఒకరితో ఒకరు నేరుగా చర్చ కావాలి. సుదీర్ఘ ప్రసంగాలతో కూడిన చర్చ నాకు వద్దు" అని రాహుల్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
ప్రధాని మోడీనే నా ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారు: రాహుల్ గాంధీ
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)