నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో టెస్టు తొలి రోజు ఆట కొనసాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ భోజన విరామ సమయానికి 26 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసింది. భారత బౌలర్ గుర్నూర్ తన తొలి టెస్టులోనే తొలి వికెట్ సాధించాడు. డేవన్ కాన్వే (31)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపించాడు. మరోవైపు కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (42) క్రీజులో నిలదొక్కుకుని నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. లాథమ్‌కు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కాగా, కాన్వేకు 150వ మ్యాచ్ కావడం విశేషం.





కామెంట్‌లు (0)