నవతెలంగాణ - హైదరాబాద్: హైదరాబాద్, ఆలేరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొనగా, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.





కామెంట్‌లు (0)