Magazines

మన ప్రజాస్వామ్యానికి అమూల్యమైన వారసత్వం రాజ్యాంగం

23 నిమిషాల క్రితం

constitution
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

కోట్లాది మంది జీవితాల్లో 
అది అంతర్భాగమైంది : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ :భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఒక అమ్యూలమైన వారసత్వమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌, పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యులకు నివాళులర్పించారు. అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్య సాధనలో రాజ్యాంగం నిరంతరం మార్గనిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా బాబాసాహెబ్‌ అంబేద్క ర్‌, రాజ్యాంగ పరిషత్‌లో భాగస్వాములైన మహనీయులందరికీ గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. వారు అందించిన రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి అమూల్య మైన వారసత్వమని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకో వడంతో పాటు, అందులో పొందుపరిచిన విలువలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించేందుకు ఈ రోజు ఒక అవకాశమని పేర్కొన్నారు. రాజ్యాంగం కోట్లాది భారతీయుల జీవితాల్లో అంతర్భాగమైందని వివరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవారే గతంలో దాన్ని బలహీనపరిచారని కాంగ్రెస్ పై మోడీ వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది: అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాం క్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అమూల్యమైన సేవలందించిన బాబాసా హెబ్‌ డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌, డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ సహా రాజ్యాంగ పరిషత్‌ సభ్యులందరికీ నివాళులర్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమైన భారత్‌కు రాజ్యాంగం బలమైన పునాది అని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్