నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కోర్టు ధిక్కరణకు పాల్పడినం దుకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్, డీసీపీ ఎన్. కోటిరెడ్డిలకు రెండు వారాల సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్‌రెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలోని 6.15 ఎకరాల భూమికి రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఎ. ప్రవీణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి ఈ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. అప్పీలుకు అవకాశం కల్పిస్తూ వారం రోజులపాటు తీర్పు అమలును నిలిపివేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేశారు.
సైబరాబాద్ సీపీ, డీసీపీలకు జైలు శిక్ష
24 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)