Magazines

ఆకుపచ్చగా ఆసిఫాబాద్

35 నిమిషాల క్రితం

Asifabad
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 2 నిమిషాల చదవడం

గిరిజనుల ఆకాంక్షకు రాష్ట్ర మహాసభ వేదిక

నేడు ఆదివాసీ కళాకారులతో 
సాంస్కృతిక కార్యక్రమాలు

27, 28 తేదీల్లో 
ఆదివాసీ గిరిజన సంఘం
రాష్ట్ర నాలుగో మహాసభ


నవతెలంగాణ- ఆసిఫాబాద్ ​
ఎంతో మంది పోరాటం.. ఎన్నో ఏండ్ల నుంచి హక్కుల రక్షణ కోసం ఆరాటం.. స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయినా ఆ జాతి నేటికీ వెనుకబాటుతనానికి గురైంది. అటువంటి జాతి హక్కుల రక్షణ కోసం పుట్టుకొచ్చి.. వారి అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ జరుపుకునేందుకు సిద్ధమైంది. ఆసిఫా బాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 28, 29 తేదీల్లో రాష్ట్ర మహాసభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఆదివాసీ సంబరానికి ఆసిఫాబాద్ పట్టణం ఆకు పచ్చ జెండాలతో అలంకరిం చుకుంది. అంబేద్కర్ చౌక్ వద్ద చౌరస్తాలో ప్రత్యేకం గా అలంకరించిన జెండాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం ఆదివాసీ కాళాకారులతో సంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. గిరిజన ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షు లు, మాజీ ఎంపీ బాబురావు నేతృత్వంలో శ్రేణులు క్షేత్రస్థాయిలో నిరంతరంగా కృషి చేస్తున్నారు. మహాసభకు ఆదివా సీలు పెద్దఎత్తున సభకు తరలి రానున్న నేపథ్యంలో వారి ఆకాంక్ష నెరవేర్చే దిశగా సంఘం నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

​ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నాయకులు

​జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో నిర్వహించే మహాసభ అనంతరం ప్రతినిధుల సభలో ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ వైస్ చైర్‌‌పర్సన్‌ బృందా కారత్ పాల్గొనన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మీడియం బాబురావు, రాష్ట్ర నాయకులు బండారి రవికుమార్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రాజన్న, ఆహ్వాన కమిటీ ఉపాధ్యక్షులు దుర్గం దినకర్‌తో కలిసి ప్రత్యేకంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.

​ఆదివాసీ కాళాకారులతో సంస్కృతిక కార్యక్రమాలు

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహాసభ సందర్భంగా శుక్రవారం ‌జిల్లా కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి ఆదివాసీ కాళాకారులతో సంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 9 ఆదివాసీ తెగలకు చెందిన 28 కళాకారుల బృందాలకు చెందిన 300 మంది కళాకారులు పాల్గొంటారు. ఒక్కో తెగకు చెందిన వారు వారి సంప్రదాయ సంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఉంటాయి. ఈ కార్యక్రమాలను మాజీ ఎంపీ, టీఏజీఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాపురావు ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులకు గుర్తింపు తెలంచిన గోండ్‌, కోయ, తోటి, కొలాం, ప్రధాన్‌, ఆంద్‌‌, యాక్‌‌పోడ్‌ మొత్తం 9 తెగలకు కళాకారుల నృత్య ప్రదర్శన ఉంటుంది. ఎంతో గుర్తింపు, ఆదరణ పొందుతున్న సాంప్రదాయ నృత్యాలు అయిన టువంటి దండారి, గుస్సాడి, థీంసా, రేళారే రేలా, కొమ్ముల డ్యాన్స్‌, చిచ్చొరి, తప్పెట్లుతో నృత్య ప్రధర్శనలు నిర్వహిస్తున్నారు. మహాసభకు మొదటి రోజు పెద్ద ఎత్తున ఆదివాసులు తరలి రానున్నరాని టీఏజీఎస్‌ ‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ ‌తెలిపారు.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్