Magazines

బండి భగీరథ్‌కు పోక్సో కోర్టు సమన్లు

30 నిమిషాల క్రితం

POCSO
avatar
balaji

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

జనవరి 28న మేడ్చల్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశం

నవతెలంగాణ – మేడ్చల్
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ (కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు)కుమేడ్చల్ జిల్లా పోక్సో కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో ఈ కేసుకు సంబంధించి అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కొంత కాలం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తర్వాత షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బండి భగీరథ్‌ బయటకు వచ్చాడు. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా జనవరి 28న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. బాలికను వేధించడంతో పాటు బలవంతంగా మద్యం తాగించి, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని బాధితురాలి తల్లి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఏడాది మే నెలలో పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైన సంగతి తెలిసిందే.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్