నవతెలంగాణ - హైదరాబాద్ : నర్మెట్ట మండలంలోని మల్లన్నగండి జలాశయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతయ్యాడు. సికింద్రాబాద్‌కు చెందిన పడాల కల్యాణ్ (27) ఆదివారం ఎనిమిది మంది స్నేహితులతో కలిసి దొంగచెలిమి తండా శివారులోని జలాశయం వద్దకు వెళ్లాడు. ప్రకృతి అందాలను వీక్షించిన అనంతరం గేట్ల ప్రాంతంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
జలాశయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గల్లంతు
05 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)