Magazines

మక్తల్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్‌.. 44 వాహనాలు సీజ్‌

1 గంట క్రితం

cordon search
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

మక్తల్‌లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్

44 ద్విచక్ర వాహనాలు సీజ్‌.. పత్రాలు చూపించిన వాటిని విడుదల

నవతెలంగాణ–మక్తల్

పట్టణంలో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న 43 వాహనాలను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 8 గంటలకు మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్, ఎల్లమ్మ కుంట ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు మక్తల్ సీఐ రాంలాల్ రాథోడ్ తెలిపారు.


ఈ కార్డన్ సెర్చ్‌లో మక్తల్, మాగనూరు, కృష్ణ, మరికల్ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో కొత్త వ్యక్తులు, వాహనాల రాకపోకలపై స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


అనంతరం సరైన పత్రాలను చూపించిన వాటిని విడుదల చేయగా, మిగతా వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నేరాలను అరికట్టేందుకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్